తెలంగాణ వీణ ,హైదరాబాద్ : పొలిటికల్ టూరిస్టులు చెప్పే మాటలను ప్రజలు నమ్మొద్దని మంత్రి కేటీఆర్(Minister KTR) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. వరంగల్ సభలో కేటీఆర్ సమక్షంలో బీజేపీ నేత ఈగ మల్లేశం బీఆర్ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…‘ ‘కేసీఆర్ ప్రభుత్వానిది సంక్షేమం, విపక్షాలది సంక్షోభం. అరవై ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పుడు తెలంగాణకు అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఒక్కఛాన్స్ ఇవ్వాలని మీదగ్గరకు వస్తారు, నమ్మి మోసపోకండి. మోసాన్ని మోసంతోనే జయించాలి. మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. త్వరలోనే కేసీఆర్ నోట శుభవార్త వింటారు. మేము ఎవరికీ బీ టీమ్ కాదు. మాది తెలంగాణలో ఏటీమ్’’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.