తెలంగాణ వీణ , హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ధ్వజమెత్తారు. కేసీఆర్ అర్ధాంగి శోభమ్మ తిరుమల వెళ్లి భర్త కోసం తలనీలాలు సమర్పించారని, మరి కేటీఆర్ ఎందుకు తిరుమల వెళ్లలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.
కేటీఆర్ ఏమైనా నాస్తికుడా…? అంటూ సందేహం వెలిబుచ్చారు. తండ్రి కోసం తలనీలాలు ఇస్తే గ్లామర్ ఏమైనా దెబ్బతింటుందా కేటీఆర్? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. కేసీఆర్ పై నాకున్న బాధ కూడా నీకు లేదంటి కేటీఆర్? అని ఎద్దేవా చేశారు.
ఇక, సీఎం కేసీఆర్ పైనా బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘రజాకార్’ సినిమా అంటే కేసీఆర్ కు భయమని అన్నారు. సినిమా విడుదల కాకముందే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నిజాం సమాధి వద్ద కేసీఆర్ మోకరిల్లారని బండి సంజయ్ విమర్శించారు.