తెలంగాణ వీణ, భక్తి : లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.. శుక్రవారం అమ్మకు ఇష్టమైన రోజు.. అందుకే ఈరోజు అమ్మను అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చెయ్యాలని పండితులు చెబుతున్నారు.. అయితే లక్ష్మీ దేవికి అలంకారం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో ఉండే మహిళలు కూడా చక్కగా ఉంటే ఆవిడకు నచ్చుతుందట. అయితే తంత్ర శాస్త్రంలో, సంపదను సంపాదించడానికి కొన్ని రకాల సాధారణమైన పద్ధతులు ఉన్నాయని చెప్పబడ్డాయి. వాటిని క్రమం తప్పకుండా అనుసరిస్తే చాలు అమ్మ అనుగ్రహం కలుగుతుంది.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..అమ్మవారికి సువాసనతో కూడినవి అంటే చాలా ఇష్టం. మల్లె పూల నుంచి కూడా మంచి సువాసన వెదజల్లుతుంది. కాబట్టి ప్రతి శుక్రవారం మల్లెపూలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది.పూజలో గంధం చాలా ముఖ్యం.. పని, వ్యాపారంలో రెట్టింపు అభివృద్ధి కావాలంటే అమ్మవారిని ప్రతి శుక్రవారం గంధంతో పూజించాలి..ప్రతి శుక్రవారం ఓ కొత్త పసుపు వస్త్రం తీసుకుని చిన్న కొబ్బరికాయను కట్టి వంట గది తూర్పు మూలలో వేలాడేలా ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఆ ఇంట్లో డబ్బుకు, తిండికి లోటు ఉండదు.. సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయి..ఇంట్లో సంపద పెరగాలంటే ప్రతి శుక్రవారం నెయ్యి దీపం వెలిగించండి. లక్ష్మీ దేవికి రెండు ముఖాల నెయ్యి దీపం వెలిగించి పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు..ఇక అమ్మవారికి తామర పువ్వులంటే ఇష్టం కనుక శుక్రవారం రోజు లక్ష్మీ దేవిని తామర పువ్వులతో పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి..ఇకపోతే లక్ష్మీ దేవి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ప్రతి శుక్ర వారం ఆవుకు గడ్డి, బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రమం తొందరగా కలుగుతుంది.. ఇలా చెయ్యడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయి..