తెలంగాణ వీణ , జాతీయం : మహారాష్ట్ర సీఎం, మరికొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను తుంగలో తొక్కకూడదని స్పీకర్‌కు సలహా ఇవ్వండని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు చెప్పింది. అనర్హతపై ఎప్పటిలోగా తేల్చుతారో స్పీకర్ చెప్పాలని, లేదంటే రెండు నెలల గడువు విధిస్తామని చెప్పింది.c చీల్చిన షిండే వర్గం ఎమ్మెల్యేలపై ఉద్ధవ్ వర్గం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ప్రక్రియను వివరించాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది.