తెలంగాణ వీణ , జాతీయం : మహిళలకు రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే ఆధ్వర్యంలో ఉమెన్స్ రైట్స్ కాన్ఫరెన్స్ జరుగుతున్నది. చెన్నైలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వారిని సీఎం స్టాలిన్, డీఎంకే ఎంపీ కనిమోళి సాధరంగా ఆహ్వానించారు. సమావేశానికి సీఎం స్టాలిన్ అధ్యక్షత వహిస్తున్నారు. పార్లమెంటుతోపాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రముఖ మహిళా నాయకులతోపాటు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ, విపక్ష ఇండియా కూటమిలోని అన్ని పార్టీల నాయకులను డీఎంకే ఎంపీ కనిమోళి ఆహ్వానాలు పంపించారు.