తెలంగాణ వీణ , జాతీయం : రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆర్‌ఎస్ఎస్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారని డీఎంకే ప్రచార కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి విమర్శించారు. ఆయన చెన్నైలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్రప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలకు సంబంధించిన బిల్లులు ఆమోదించకుండా గవర్నర్… ఆర్‌ఎస్ఎస్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రప్రభుత్వం గురించి ఏదో ఒక విమర్శ చేస్తున్నారని, 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం కోల్పోవడం తథ్యమని భారతి జోస్యం చెప్పారు.