తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. 65.78 లక్షల మంది పెన్షనర్లకు రూ. 1813.60 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.
ప్రతీ నెల మాదిరిగానే ఒకటో తేదీ తెల్లవారుజామునుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు. ఉదయం గం. 8.00 ల వరకూ 25.58 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయ్యింది. 16.82 లక్షల మందికి రూ.463.41 కోట్లు అందజేశారు వాలంటీర్లు.