తెలంగాణ వీణ , జాతీయం : భారత వాయుసేనకు చెందిన ఏఎల్‌హెచ్ ధృవ్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ముందు జాగ్రత్తగా పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేశాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోని మైదాన ప్రాంతంలో హెలికాప్టర్‌ను సేఫ్ ల్యాండ్ చేశారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, హెలిక్యాప్టర్‌లో ఉన్న పైలెట్‌లు, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి. హెలికాప్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరి చేసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఘటనా ప్రాంతానికి పంపినట్లు తెలిపింది.