తెలంగాణ వీణ , అచ్చంపేట : ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయడం పట్ల ప్రధాని మోడీకి గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మానాయక్ కృతజ్ఞ తలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ప్రారంభి. స్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. యూనివర్సిటీ నిర్మాణానికి 900 కోట్ల రూపా పాటు 500 ఎకరాల్లో యూనివర్సిటీని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం బిడ్డలపై బిజెపికి ఉన్న ప్రేమ ఋజువు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు. ముఖ్యంగా యువత మహిళలు బిజెపి వైపు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ప్రారంభంతో గిరిజన బిడ్డలు ఉన్నత విద్య చదువుకోడానికి కేంద్రం మంచి అవకాశాన్ని ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల పక్షాన ట్రైబల్ యూనివర్సిటీ ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ పేరుమీద ప్రకటించినందుకు గిరిజన బిడ్డలు ప్రధాని మోడికి రుణపడి ఉంటారని గుర్తు చేశారు. చెంచు లంబాడా ఎరుకల గోండు 33 తెగలకు ఈ రాష్ట్రంలో వెనుకబడిన గిరిజన జాతికి అంకితం చేసినందుకు వారికి గిరిజన మోర్చా రాష్ట్ర తరపున ప్రధాని మోడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు.