తెలంగాణ వీణ , హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమైందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో తీజ్, సేవాలాల్ భవనాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ కాపీలను గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి మంగళవారం ఆయన అందజేశారు. భీమ్‌గల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మంత్రులు బంజా రా మహిళలతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారుఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదన్నారు. తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. సేవాలాల్, తీజ్ భవనాల నిర్మాణానికి రూ.2.50 కోట్ల ప్రొసీడింగ్‌లను అందజేస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో తీజ్ భవనాల నిర్మాణాల కోసం రాష్ట్రంలో మొదటగా బాల్కొండ నియోజకవర్గంలోనే నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. గిరిజన లంబాడాల అభివృద్ధికి కృషి చేస్తున్న తనను ఆశీర్వదించాలని మంత్రి కోరారు.బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. సీఎం కేసీఆర్‌కు మంత్రి ప్రశాంత్‌రెడ్డి కుడి భుజం లాంటివారని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. స్వయంగా ఇంజినీర్ అయిన మంత్రి వేముల రాష్ట్రంలోని అనేక చారిత్రాత్మక కట్టడాల్లో భాగస్వామ్యం కావడం చాలా గొప్ప విషయమని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ గిరిజన యూనివర్సిటీ ప్రకటన మోసపూరితమని ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీకి 9 కోట్లు కాదు కదా.. రూ. 9 లక్షల కోట్లు ఇచ్చినా గిరిజన బిడ్డలు బీజేపీని నమ్మరని తేల్చి చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ రేవంత్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నాడని, 65 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.