తెలంగాణ వీణ , మల్కాజ్గిరి : మైనంపల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని బిజెవైఏం నేత పిఏం సాయి ప్రసాద్ అన్నారు. శనివారం అల్వాల్ PS లో హన్మంతరావుపై ఫిర్యాదు చేశారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి ఓల్డ్ అల్వాల్లోని తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారని CC ఫుటేజీ విడుదల చేశారు. ఓ రౌడీషీటర్కు సుపారీ ఇచ్చి ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. మల్కాజిగిరిలో మైనంపల్లి ఆగడాలు ఎక్కువయ్యాయని.. ప్రశ్నస్తే ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని పిఏం సాయి చెప్పారు.