తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : పచ్చ పార్టీ నాయకులు ఎందుకు తిరుమలను లక్ష్యంగా చేసుకొని గత పది రోజులుగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అనే పేరుతో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల ఆలయ పరిసర ప్రాంతాలలో తెలుగుదేశం జెండాలతో ఫోటోలు తీసి రాజకీయం చేయాలని చూస్తున్నారు?. చివరికి స్టీలు గ్లాసులతో తెలుగుదేశం పార్టీ మోత మోగించు అనే నిరసన కార్యక్రమాన్ని కూడా తిరుమలలో చేయాలని చూడడం ఏవగింపు కలిగిస్తుంది. ఈ విషయంపై హైందవులు, తిరుమల శ్రీవారి భక్తులు తెలుగుదేశం పార్టీ వైఖరిని చీదరించుకుంటున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టయిన చంద్రబాబుకి మద్దతుగా గత పది రోజులుగా ఏదో ఒక విధంగా తెలుగుదేశం జెండాను చూపిస్తూ ఫోటోలు దిగి సామాజిక ఉద్యమాల్లో సర్కులేట్ చేయడం ద్వారానో లేక తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న నిరసనలతో తిరుమలలో వివాదాస్పదం చేసి, అధికార పక్షాన్ని ఇరకాటంలోకి పెట్టాలని శతవిధాల తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నారు.