తెలంగాణ వీణ , హైదరాబాద్ :కాంగ్రెస్ పార్టీది గతమని, ఇప్పుడా పార్టీ ఖతమైందని, వారంటీ ముగిసిన పార్టీ గ్యారంటీ ఎలా ఇస్తుందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. 150 ఏళ్ల కాంగ్రెస్ వారంటీ అయిపోయిందని, ఆరు గ్యారంటీలు ఇస్తే ప్రజలు నమ్ముతారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు 24 గంటల కరెంట్‌పై అనుమానం ఉందని, జగిత్యాల నియోజకవర్గానికి వచ్చి కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ దరిద్రం పోతుందని వ్యాఖ్యానించారు.
రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంట్ అని, ఆ పార్టీ నేత పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సోనియాకు సైతం లేఖ రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. బీజేపీ మతపిచ్చి పార్టీ అని, జనాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవడమే ఆ పార్టీకి తెలుసని ధ్వజ మెత్తారు. పీఎం మోదీని సీఎం కేసీఆర్ విమర్శించినంతగా వేరే ఎవరూ విమర్శించలేరని, మాకు ఆ పార్టీతో, మోదీతో ఎలాంటి మిలాఖత్ లేదనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. మోదీది గాడ్సే వారసత్వమని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ అంటే కాళేశ్వరం..