తెలంగాణవీణ, కాప్రా : రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థి మందుమల్ల పరమేశ్వర్ రెడ్డి అన్నారు . ఆదివారం ఎన్నికల ప్రచారంలో బాగంగా కాప్రా సర్కిల్ పరిధిలోని నాగార్జునగర్ కాలనీ, జైజవాన్ కాలనీ, జమ్మిగడ్డ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తోందన్నారు. పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ విజయానికి కార్యకర్తలు, నాయకులు దొహాదపడాలని కోరారు. కాలనీల్లో మహిళలు మంగళహారతీలతో స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రూ. 500 లకే వంటగ్యాస్ అందుతుందన్నారు . బీఆర్ఎస్ చెబుతున్న మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనీ, హాస్తం వైపే చూస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సహాంగా ప్రచారంలో పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.