తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ రావడంతో ఆ పార్టీ
శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ,ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి నుంచి నేరుగా తిరుపతి వెళ్లి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, అనంతరం హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రికి చంద్రబాబు వెళ్లనున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి .
బాబు కు మధ్యంతర బెయిల్ రావడంతో సంబరాలు
