తెలంగాణవీణ, మేడ్చల్ : మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి మంత్రి చామకూర మల్లారెడ్డికి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం బీఫాం అందజేశారు. ఆదివారం మొదటి సారిగా తెలంగాణ భవన్లో 51 మందికి బీఫాం అందజేసిన విషయం విదితమే. కాగా సోమవారం మరికొంత మందికి బీఫాం ప్రకటించారు. అందులో భాగంగా నగరంలో మంత్రి మల్లారెడ్డితో పాటు అభ్యర్థులుగా ప్రకటించిన మరికొంత మందితో పాటు బీ ఫాం అందజేశారు. అయితే మొదటి రోజు కేవలం 51 మందికే బీఫారం ఇవ్వడంపై మరికొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయా అని ఊహాగానాలు చెలరేగాయి. ఆఊహలకు తెరదించుతూ సీఎం కేసీఆర్ అభ్యర్థులుగా ప్రకటించిన వారికే బీ ఫాంలను అందజేశారు.