తెలంగాణ వీణ , నిజామాబాద్ : మంజులమ్మ మృతికి సీఎం కేసీఆర్ సంతా పం ప్రకటించారు. తల్లి మరణంతో శోకతప్తులైన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో శుక్రవారం జరిగే అంత్యక్రియలకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్‌లో వేల్పూర్‌కు చేరుకోనున్నారు.
కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సైతం అంత్యక్రియలకు హాజరుకానున్నారు. మంజులమ్మ మృతికి గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మహేందర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులు సంతాపం తెలిపారు. కాగా ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, సీహెచ్ మదన్‌రెడ్డి, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహాచారి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ మధుశేఖర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ రిక్క లింబాద్రి తదితరులు మంత్రి వేములను కలిసి ఓదార్చారు.