తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖ చేరుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు వెళ్లారు. సీఎంతో పాటు వైవీ సుబ్బారెడ్డి, విడదల రజని ఉన్నారు. ఎయిర్ పోర్టులో జగన్ కు వైసీపీ నేతలు గుడివాడ అమర్ నాథ్, కరణం ధర్మశ్రీ, బూడి ముత్యాల నాయుడు, ఎంపీ సత్యవతి, ఎంపీ సత్యనారాయణ తదితరులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో మధురవాడకు జగన్ బయల్దేరారు. మధురవాడలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇన్ఫోసిస్ తో పాటు వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో జగన్ కాసేపు సంభాషించనున్నారు. ఆ తర్వాత విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు బయల్దేరుతారు.