తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : అంగళ్లు అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పై ఇప్పటికే ఇరువైపు వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును వెలువరిస్తామని తెలిపింది. ఈరోజు తీర్పును వెలువరించింది. లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ మెత్తాన్ని రెండు షూరిటీ బాండ్ల రూపంలో జమ చేయాలని ఆదేశించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ రావడంతో… టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.