తెలంగాణవీణ, కాప్రా : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ జెమ్మిగడ్డ ఎన్ టి ఆర్ విగ్రహం వద్ద తెదేపా రాష్ట్ర కార్యదర్శి నీరుకొండ సతీష్ బాబు ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సతీష్ బాబు ఆధ్వర్యంలో మాట్లాడుతూ చంద్రబాబుకు ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు యావత్ దేశంలోనూ అభిమానులు ఉన్నారన్నారు.గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రలు అరెస్టు అవ్వటం చూశాం.. కానీ, ఎప్పుడు ఎవరికి లేని స్పందన.. చంద్రబాబు నాయుడుకు ప్రజలు నుంచి వస్తోందని అన్నారు. జగన్ కు వైసీపీ నేతలకు ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. కేటీఆర్,కేసీఆర్ లు చంద్రబాబు అరెస్ట్ పై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పై మండిపడ్డారు. కేటీఆర్ ఆంధ్రలో చేస్కోండి అని మాట్లాడటం పై అసహనం వ్యక్తం చేశారు.తెలంగాణ సెటిలర్స్ అంతా బి ఆర్ ఎస్ పార్టీ ఓటమికొరకు పనిచేస్తుందని తెలంగాణ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు.ఇప్పటికైనా చంద్రబాబు విడుదల కోసం కృషి చేయాలన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ అరాచక పాలనపై విసిగిపోతున్నారన్నారు.మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకుడ్ని కడిగిన ముత్యంలా బయటకి రావాలని కోరుతూ కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించారు. రాములు యాదవ్ , సాంబశివరావు , శివానంద జనార్దన్ ఆనంద్ బాలరాజు వెంకటేశ్వరరావు టింకు జగన్ మోహన్ రమణ సతీష్ నవీన్ కుమార్ లు పాల్గొన