తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ విజయం ఖాయమని కంటోన్మెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గ నాయకులు మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అనుకున్నంత అభివృద్ధి జరగలేదన్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యే నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన రూ.6 కోట్ల నిధులను తేలేదని ఆయన ఆరోపించారు. పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారని తెలిపారు. ఇప్పటికే మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్స్‌లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించామన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సునీతారాము యాదవ్, మీనాఉపేందర్ రెడ్డి, శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, జ్యోతిగౌడ్, అనిల్‌కిశోర్, రాముయాదవ్, ఉపేందర్ రెడ్డి, అమీనుద్దీన్, శ్రీనివాస్‌గౌడ్, రవీందర్, సిద్ధిరాములు, రాజేశ్ కన్న పాల్గొన్నారు.