తెలంగాణ వీణ , కాప్రా : బీఆర్ఎస్ పార్టీలోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతుందని, తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం సైనిక్ పురి, బిఆర్ఎస్ క్యాంప్ కార్యలయంలో చర్లపల్లి డివిజన్ కడియాల అనిల్ ఆధ్వర్యంలో బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో 100 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా బండారి లక్ష్మారెడ్డి వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చాలా మంది ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉప్పల్ నియోజక వర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమంటూ, కారు గుర్తుకు ఓటేసి ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధిగా తనని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఉప్పల్ అబివృద్ధి ప్రదాతగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోంతు శ్రీదేవి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మహేష్ గౌడ్, కే.అనీల్, డి.బాలకృష్ణ, శ్రవణ్, ఏ. రాజు, భాను ప్రకాష్, కిరణ్, నాగసాయి, ఆర్కే వంశీ, సిహెచ్ శివ, కే.శవ, వి.ప్రకాష్, ప్రభు, వంశీ తదితరులు పాల్గొన్నారు.