తెలంగాణ వీణ , హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీది గాంధీ స్ఫూర్తి అయితే.. బీజేపీది గాడ్సే స్ఫూర్తి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌తో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి బీఆర్ఎస్ తరపున నివాళులర్పిస్తున్నట్లు ప్రకటించారు. గాంధీ ఆశయాలను కేసీఆర్ ప్రభుత్వం కచ్చితంగా ఆచరిస్తున్నదని తెలిపారు. గాంధీ సినిమాను దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు రాష్ట్రంలో ప్రదర్శించి జాతిపిత గురించి మరింతగా తెలిసేలా చేశామన్నారు. నకిలీ గాంధీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నిన్న పీఎం మోదీ అబద్దాలు అలవోకగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మోదీ లాంటి వ్యక్తి గల్లీ నాయకుడి స్థాయిలో వ్యవహరించారు. ప్రాజెక్టుల ద్వారా ఒక చుక్క నీరు పారలేదని మోదీ నిస్సిగ్గుగా మాట్లాడారు. ఇంత కన్నా అబద్దం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు.