తెలంగాణ వీణ , హైదరాబాద్ : బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేలా నగరంలో చారిత్రక కట్టడాలు, నిర్మాణాలను గులాబీ వెలుగులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మాసోత్సవాలు చేపట్టారు. ఈ మాసోత్సవాలలో భాగంగా పెయింట్ ది సిటీ పింక్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. నగరంలోని చార్మినార్, హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం, టీ హబ్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిలకు పింక్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ డా. పి రఘురామ్ పేర్కొన్నారు. ఏటా ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ మహమ్మారి బారిన పడుతున్నదని, ప్రతి ఇద్దరిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఉంటున్నాయన్నారు. పలు అధ్యయనాల నేపథ్యంలో అవగాహన కల్పించి, ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడంతో ప్రాణనష్టం తగ్గించడానికి వీలు ఉంటుందని తెలిపారు.