Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మెగాస్టార్‌తో బోయపాటి శ్రీను పాన్‌ ఇండియా

 మెగాస్టార్ చిరు ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠతో సోషియో ఫాంటసీ సినిమాకు రెడీ అవుతున్నాడు. టైటిల్‌ పోస్టర్‌తోనే ఈ సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొల్పాయి. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇక దీనితో పాటు సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణతో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్నాడు. అయితే ముందుగా దేన్ని పట్టాలెక్కిస్తాడో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇక తాజాగా చిరు కొత్త సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్ మీడియాను ఊపేస్తుంది. చిరు తన నెక్స్ట్‌ సినిమాను బోయపాటితో చేయబోతున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య బోయపాటి చిరుకు ఓ లైన్‌ చెప్పాడట. అది బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసి తీసుకురమ్మన్నాడట. ఇక చిరుకు ఫైనల్‌ నెరేషన్‌ నచ్చితే ఈ సినిమా పట్టాలెక్కే చాన్స్‌ ఉందట. అంతేకాకుండా ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించాలని బోయ ప్లాన్‌ చేస్తున్నాడట. ఇందులో నిజమెతుందో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది.

error: You are not allowed to Copy Our Content , Thank you