తెలంగాణ వీణ, సినిమా : వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్న అనుపమ్ దాదాపు నాలుగున్నర దశాబ్దాల కిందటి సంఘటనను గుర్తు చేసుకొని, రవితేజకు క్షమాపణ చెప్పారు.1988లో రవితేజ తనతో ఫోటో దిగడానికి స్టూడియోకు వచ్చాడని, కానీ తాను షూటింగ్ బిజీ కారణంగా కుదరదని చెప్పానని, ఆ రోజు అలా అన్నందుకు ఇప్పుడు క్షమాపణ చెబుతున్నానని అనుపమ్ ఖేర్ అన్నారు. దీంతో పక్కనే ఉన్న రవితేజ, అది ఇప్పుడు ఎందుకు అన్నట్లుగా ‘సర్ ప్లీజ్..’ అన్నారు. అనుపమ్ ఖేర్ ఈ విషయం చెప్పిన తర్వాత అభిమానుల నుంచి రవితేజకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.