తెలంగాణ వీణ , హైదరాబాద్ : గత కొన్ని సంవత్సరాలుగా ఉప్పల్ ప్రజలు ఎదురుచూస్తున్న 100 పడకల ఆసుపత్రి ఎట్టకేలకు ఏర్పాటుకు జిఓ రావడంతో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన ఉప్పల్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి . ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, MBC మాజీ చైర్మెన్ తాడూరు శ్రీనివాస్, మీర్ పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ కొత్త రామరావు,మహేష్ గౌడ్ డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.