తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఈ రోజు మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ బస్తీలో ఏర్పాటుచేసిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణి కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి , స్థానిక కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్ ముఖ్య అతిథులుగా హాజరై డబల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు, కలలో కూడా ఊహించిన విధంగా లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు రావడంతో వారి ఆనందానికి అవధులు లేవని వారి ఆశీర్వాదం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని భావోద్వేక్తులైనారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇల్లు లేని పేదల కలలను సాకారం చేసే విధంగా నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉచితంగా నిర్మించి ఇస్తుందని అన్నారు. ఇళ్ల కేటాయింపు విషయంలో కూడా ఎవరి ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా కంప్యూటరైస్డ్ రాండమైజేషన్ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ రోజుతో 61884 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పట్టాల పంపిణీ పూర్తీ అయిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుందని రాష్ట్ర ప్రజలకు ఏం అవసరమో ముఖ్యమంత్రి కి తెలుసని ఆ దిశగానే ఇక ముందు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. అనంతరం ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ తో కలిసి రాజీవ్ నగర్ ప్రాథమిక పాఠశాలను సోషల్ వెల్ఫేర్ వస్తి గృహంగా అభివృద్ధి చేయాలని మరియు స్థానికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు విషయంలో ప్రాధాన్యత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. మరియు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్లు గుండారపు శ్రీనివాస్ రెడ్డి, పావని మణిపాల్ రెడ్డి, కొత్త రామారావు, గోల్లురి అంజయ్య, జిహెచ్ఎంసి అధికారులతో పాటు స్థానిక నాయకులు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.