తెలంగాణ వీణ , హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండి, వందేళ్లు బతకాలని, ఆయనను ఆశీర్వదిస్తే తాము మరింత ఉత్సాహంగా పనిచేస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మినీ శిల్పారా మంలో జిల్లా వెనకబడిన తరగతులశాఖ ఆధ్వర్యంలో బీసీ కులాలకు ఇస్తున్న ఆర్థిక సహాయంలో భాగంగా 200 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కులను మంత్రి అందజేశారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్‌గౌడ్, గంజి ఎంకన్న, కొరమోని వెంకట య్య, గోపాల్‌యాదవ్, అబ్దుల్ రహమాన్, చెరుకుపల్లి రాజేశ్వర్, తాటి గణేశ్, గిరిధర్‌రెడ్డి, ఎంపీపీ సుధాశ్రీ, అనిత, రామ్‌లక్ష్మణ్, వడ్ల శేఖర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరికలు
ఆదివారం పట్టణంలోని 30వ వార్డు వీరన్నపేటకు చెందిన బీజేపీ కార్య కర్తలు పెద్దఎత్తున మంత్రి క్యాంప్ కార్యాలయం లో బీఆర్‌ఎస్‌లో చేరగా మంత్రి వారికి కండు వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన వారు పార్టీకోసం కష్టపడి పనిచేయాలని అన్నారు. రానున్న రోజుల్లో వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు అంజయ్య, పట్టణ కోశాధి కారి గాండ్ల శివకుమార్ ఆధ్వర్యంలో పలువురు చేరారు. నాయకులు గోపాల్‌యాదవ్, శాంతన్న యాదవ్, శివరాజు పాల్గొన్నారు.
ఫ పెయింటర్స్ భవన నిర్మాణానికి భూమి పూజ : క్రిష్టియన్‌పల్లిలోని గౌతమబుద్ధ నగర్‌లో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న జిల్లా బిల్డింగ్ పెయిం టర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భూమిపూజ చేశారు. ఇదే కాలనీలో రూ.10 లక్షలతో దేవాంగ కుల కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాణి, నాయకులు విశ్వనాథ్, ఎం.డి. నశీర్, భీమేశ్‌గౌడ్, ఎం.డి. ఇసాక్, రమేశ్ నాయక్ పాల్గొన్నారు.