తెలంగాణ వీణ , రాష్ట్రీయం : రాష్ట్ర బీజేపీలో హుషారు పెంచేందుకు కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. మాస్‌లీడర్ ఇమేజ్ ఉన్న సంజయ్ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు హెలికాప్టర్ కేటాయించింది. ప్రతిరోజు ఉదయం11గంటల వరకు తన సొంత నియోజకవర్గం కరీంనగర్‌లో ప్రచారం చేసిన తర్వాత రెండు, మూడు నియోజకవర్గాలకు హెలిక్యాప్టర్‌లో వెళ్ళనున్నారని సమాచారం.