తెలంగాణ వీణ , హైదరాబాద్ : సిద్దిపేట-సికింద్రాబాద్ రైలు ప్రా రంభోత్సవంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికారిక కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంలా మార్చేశారు. ప్రొటోకాల్‌ను గాలికి వదిలేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టినా సిద్దిపేట రైలు ప్రారంభోత్సవం సందర్భంగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఫొటోలను విస్మరించారు. సమాచారం ఇవ్వడంలోనూ రైల్వే అధికారులు నిరక్ష్యంగా వ్యవహరించారు. ప్రారంభోత్సవ సమాచారాన్ని కొన్ని గంటల ముందు మాత్రమే ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేశారు. విషయం తెలిసిన బీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.