తెలంగాణ వీణ , హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రాయపోల్ మండలంలోని అనాజీపూర్ గ్రామానికి చెందిన మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి గాండ్ల కనకయ్య, కిసాన్‌మోర్చ అధ్యక్షుడు అమ్మని మహేశ్ తదితరులు, అలాగే మండలంలోని వీరనగర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ పార్టీకి గుడుబై చెప్పి బుధవారం ఎంపీ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
వారికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఎంపీ మట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు తాను ఎల్లప్పుడు అండగా ఉంటా నన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా బీఆర్‌ఎస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు