తెలంగాణ వీణ : బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి మీతో కలిసి పని చేసే అవకాశం ఇచ్చినందుకు మరియు నన్ను మీ కుటుంబంలో ఒక్కడిగా ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం లేఖలో పేర్కొన్నారు. కానీ, గత పది సంవత్సరాల నుంచి నాకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినప్పటికీ మీ మీద గౌరవంతో ఒక కార్యకర్తగా నేను పార్టీలో కొనసాగుతూ వచ్చాను.. కానీ మీరు చేవెళ్ల అసెంబ్లీ అభ్యర్థి ఎన్నిక చేయడం పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం నాకు చాలా బాధ కలిగించింది.. నేను చేవెళ్ల నియోజకవర్గం ప్రజల కోసం వాళ్ళ కోరిక మేరకు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయదలచుకున్నాను.. కావున పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు.