తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భారీ రిలీఫ్ దొరికింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో భాగంగా చంద్రబాబు నాయుడుకు ఇవాళ బెయిల్ వచ్చింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.
కేవలం నాలుగు వారాల పాటు మాత్రమే చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అనారోగ్యం కారణంగానే ఈ కేసులో చంద్రబాబు నాయుడు కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.
సెప్టెంబర్ 9న స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును నంద్యాలలో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఏసీబీ కోర్టు ఆయనకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి చంద్రబాబు లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నిస్తూ వచ్చినప్పటికీ ఏసీబీ కోర్టు తిరస్కరిస్తున్నది. ఈ నేపథ్యంలో అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నేడు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది.