తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఎమ్మెల్యే చినరాజప్ప ములాఖత్ అయ్యారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అలాగే భవిష్యత్ కార్యచరణపై సైతం వీరు చర్చించనున్నట్టు సమాచారం. రాజకీయంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దానిపై వీరికి చంద్రబాబు సూచనలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ నేడు చంద్రబాబుకు బెయిల్ రాకుంటే తదుపరి కార్యచరణ ఏంటన్న దానిపై చంద్రబాబు భువనేశ్వరి, బ్రాహ్మణిలకు దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం.