తెలంగాణ వీణ, హైదరాబాద్ : చిల్కానగర్ డివిజన్లోని వివిధ ప్రాంతాలలో 2 కోట్ల 37 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ శంకుస్థాపన చేసారు. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మరియు కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్ అంటేనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని, జిహెచ్ఎంసి నుండి వివిధ అభివృద్ధి పనులకు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా అధికారులు కూడా కాంట్రాక్టర్లతో పనుల జరిగే సందర్భంగా నాణ్యత పాటించాలని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, అధికారులు EE నాగేందర్, DE నిఖిల్ రెడ్డి,AE రాజ్ కుమార్ , బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి వివిధ కాలనీల అధ్యక్షులు కార్యదర్శులు వారి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డివిజన్ మహిళ నాయకురాలు, కాలనీలలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.