తెలంగాణ వీణ , సినిమా : అతిలోక సుందరి అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు శ్రీదేవి. టీనేజ్లోనే హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ.. కొన్ని దశాబ్దాల పాటు మన దేశవ్యాప్తంగా సినిమాలకు మకుటం లేని మహారాణిగా పేరు సంపాదించింది. పెళ్లి-ఫ్యామిలీ కోసం కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీదేవి. రెండో ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. కానీ 2018లో ప్రమాదవశాత్తూ చనిపోయింది. దీంతో అభిమానులకు లెక్కలేనన్ని అనుమానాలు. ఇప్పుడు ఆ సంఘటన గురించి పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు శ్రీదేవి భర్త బోనీ కపూర్. 2018 ఫిబ్రవరిలో ఫ్రెండ్ కుటుంబంలో పెళ్లికి హాజరయ్యేందుకు శ్రీదేవి, తన ఫ్యామిలీతో కలిసి దుబాయి వెళ్లింది. అయితే బాత్‌టబ్‌లో జారిపడి చనిపోయిందన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమె ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో చాలామంది బోనీ కపూర్‌ని అనుమానించారు. కానీ ఇన్నాళ్లుగా ఆ సంఘటన గురించి పెద్దగా తలుచుకోని ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.