తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఏటా రాష్ట్రంలోని ఆడబిడ్డలకు సర్కారు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేస్తుందని, ఈప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సింది మీరేనని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని 27వ డివిజన ప్రకా్‌షనగర్, 22వ డివిజన చర్చికాంపౌండ్ ఎన్నెస్పీ క్యాంపు డీపీఆర్సీ భవనంలో బుధవారం మహిళలకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 4.27 లక్షల చీరలను సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వం అన్ని కులాల పండుగలకు ప్రాధాన్యమిస్తూ కానుకలు అందిస్తోందని, అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తోందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలిచాయని, మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకొనే ఈ పండుగకు ఆడబిడ్డలంతా ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన లింగాల కమల్‌రాజ్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన బచ్చు విజయ్‌కుమార్, మునిసిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, గజ్జెల లక్ష్మీ, సరస్వతి, రవి నాయక్, పగడాల శ్రీవిద్య, నాగరాజు, శీలంశెట్టి రమా వీరభద్రం, గోళ్ల చంద్రకళ, దొడ్డా నగేష్, డీఆర్డీవో విద్యాచందన, ఖమ్మం మునిసిపల్ డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ స్వామి, మునిసిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.