తెలంగాణ వీణ, హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.కాప్రా జైజవాన్ కాలనీలో మహిళలు,యువతులు తమదైన శైలిలో పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ సంబరాలు జరుపుకున్నారు.ఆటపాటలు, కోలాటాలతో, పువ్వులను పూజిస్తూ ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకొనే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవం బతుకమ్మ పండుగ.తెలంగాణ ప్రజలు మన సంస్కృతిని ప్రపంచానికి చాటే పండుగ బతుకమ్మ అని మహిళలు కొనియాడారు.