తెలంగాణ వీణ, హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పితృ అమావాస్య రోజున ఎంగిలిపూలతో ప్రారంభమైన వేడుకలు.. సద్దులతో ముగిశాయి. తంగేడు, గునుగు, పట్టుగుచ్చులు తదితర తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు.సద్దుల బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పితృ అమావాస్య రోజున ఎంగిలిపూలతో ప్రారంభమైన వేడుకలు.. సద్దులతో ముగిశాయి. తంగేడు, గునుగు, పట్టుగుచ్చులు తదితర తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. తర్వాత గౌరమ్మను చేసి.. పసుపు కొమ్ము, వక్కతో పాటు గౌరమ్మను చేసి బతుకమ్మలో పెట్టి పూజించారు.సాయంత్రం బతుకమ్మలను కూళ్ల వద్దకు చేర్చి.. ఉయ్యాల పాటలు పాడుతూ.. రాగయుక్తమైన పాటలకు లబద్ధంగా తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. ఎక్కడ చూసినా చౌరస్తాలన్ని బతుకమ్మలతో నిండిపోయాయి. తీరొక్క పూలతో పేర్చిన అనంతరం గంగమ్మ ఒడికి బతుకమ్మలను చేర్చి.. గౌరమ్మను పూజించి వెళ్లి రావే బతుకమ్మ అంటూ గంగమ్మ ఒడికి సాగనంపారు.