తెలంగాణ వీణ , హైదరాబాద్ : బీజేపీ, ప్రధాని మోదీ అబద్ధం అనే పదానికి పర్యాయపదాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. మోదీ పుట్టిన తేదీ అబద్ధం. చాయ్ అమ్మింది అబద్ధం. చదువు అబద్ధం అని విమర్శించారు. అబద్ధాల పునాదుల మీద పుట్టి, అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు.బీజేపీకి తెలంగాణలో పుట్టగతులు లేకుండా పోయాయని, ఆ ఫ్రస్టేషన్‌లో నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారని విమర్శించారు. నిజామాబాద్‌లో మోదీ మాట్లాడిన మాటల్లో ఒక్కటి నిజం లేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని, ఫేక్ ఫ్యాక్టరీ బీజేపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.