తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లోకేష్ లంచ్ మోషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసులో నిబంధనలు సవాల్ చేస్తూ హైకోర్టులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఊరట దక్కింది. ఏపీ హైకోర్ట్ ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 4వరకు లోకేష్‌ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్ట్ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత శుక్రవారం ఉదయమే బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా పరిశీలించిన అనంతరం హైకోర్ట్ ఈ ఆదేశాలిచ్చింది. కాగా ఈ కేసులో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే.