తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : రాజధాని అమరావతి అసైన్ భూముల వ్యవహారంలో సీఐడీ దాఖలు చేసిన కేసుల్లో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు పొడిగించింది. నారాయణతో పాటు మరి కొంతమంది కొనుగోలుదారులకు కూడా నేటితో ముందస్తు బెయిల్ గడువు ముగియనుంది. ఈ కేసుపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా.. తమకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. దీంతో హైకోర్టు కేసు విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు ముందస్తు బెయిల్ పొడిగిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. రామకృష్ణ హౌసింగ్ యజమాని బాబీ, మరికొందరు నారాయణ సంస్థల ఉద్యోగులకు కూడా ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.