తెలంగాణ వీణ , జాతీయం : ప్రియుడి కోసం పాకిస్తాన్ వెళ్లిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అంజూ అలియాస్ ఫాతిమా గుర్తుందా. ఈ ఫాతిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలేసి మరీ పాక్‌లోని మారుమూల గ్రామానికి వెళ్లి ఫేస్‌బుక్ స్నేహితుడిని పెళ్లాడిన అంజూ త్వరలోనే భారతదేశానికి రానుంది. అంజూ తన పిల్లల్ని కలిసేందుకే భారత్ వెళ్లేందుకు పాక్ ప్రభుత్వం అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తోందని స్వయంగా ఆమె భర్త నస్రుల్లా వెల్లడించారు.
కాగా ఫేస్‌బుక్‌లో పరిచయమైన నస్రుల్లా కోసం పాకిస్తాన్ వెళ్లింది అంజూ. అయితే తమది ప్రేమలేదు దోమా లేదు..పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ముందు చెప్పినప్పటికీ ఆ తరువాత ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుంది. అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం, దీనికి సంబంధించిన వీడియో కూడా బయటికి రావడం ప్రస్తుతం సంచలనంగా మారడం తెలిసిందే. ఆగస్టులో ఈమె వీసానుమరో ఏడాది పాటు పొడిగించింది. అయితే నస్రుల్లాతో ప్రేమ, పెళ్లికి ముందే అంజూకి రాజస్థాన్‌కు చెందిన అరవింద్‌తో పెళ్లయింది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు.