Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

నడిరోడ్డుపై అగ్నికి ఆహుతైన ఎలక్ట్రిక్‌ కారు

Must read

తెలంగాణ వీణ , జాతీయం : విద్యుత్ శక్తితో నడిచే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లు రన్నింగ్‌లోనో, ఛార్జింగ్‌ అవుతున్న సమయంలోనే మంటలు చెలరేగి కాలిపోయిన ఘటనలు ఎన్నో చూశాం. అయితే, ఇప్పుడు ఓ ఎలక్ట్రిక్ కారు నడి రోడ్డుపై అగ్నికి ఆహుతైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ కారు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలను కొందరు తమ మొబైల్స్‌లో చిత్రీకరించారు. .బెంగళూరు సిటీలోని జేపీ నగర్‌లో గల దాల్మియా సర్కిల్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై జేపీ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారులోంచి మంటలు రావడం గమనించి అందులో ఉన్నవాళ్లు బయటికి వచ్చారని, ఆ తర్వాత కారు
మరోవైపు ఎలక్ట్రిక్ కారు మంటల్లో కాలిపోవడంతో విద్యుత్‌ వాహనాల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పగటిపూట వేడిని తట్టుకోలేక ఎలక్ట్రిక్‌ వాహనాల్లోని బ్యాటరీల్లో మంటలు చెలరేగుతున్నాయని, ఆ తర్వాత వాహనాలు తగులబడి పోతున్నాయని, ఇది ఆ వాహనాల్లో ప్రయాణించే వారి ప్రాణాల మీదకు తెస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you