Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మీతో నన్ను నేను పోల్చుకోవడమా?..నెవ్వర్..

Must read

తెలంగాణ వీణ, సినిమా : దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత తన మెంటార్ అమితాబ్‌బచ్చన్‌తో కలిసి పనిచేస్తున్నందుకు తన హృదయం ఆనందంతో ఉప్పొంగుతోందన్న తమిళ తలైవర్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై అమితాబ్ స్పందించారు. రజనీకాంత్ సర్ అని సంబోధిస్తూ.. ‘తలైవర్170’ టైటిల్‌ను చూశానని, తలైవర్ అంటే నాయకుడు, అధిపతి, ముఖ్యుడు అని పేర్కొన్నారు. మీరు అధిపతి, నాయకుడు, చీఫ్.. ఈ విషయంలో ప్రజలకేమైనా సందేహముందా? అని ప్రశ్నించారు. తనను తాను రజనీకాంత్‌తో పోల్చుకోలేనని తేల్చి చెప్పారు. మీతో కలిసి మళ్లీ పనిచేయడం తనకు లభించిన గొప్ప గౌరవమంటూ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రజనీకాంత్ 170వ సినిమాకు రెడీ అయిపోయారు. ‘జైభీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కేరళలోని తిరువనంతపురం అగ్రికల్చరల్ యూనివర్శిటీలో ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని తిరునల్వేలిలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you