తెలంగాణ వీణ ,హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆశయాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాత్రమే నెరవేరుస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అంబేదర్ స్ఫూర్తితో తెలంగాణలో అనేక పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె శుక్రవారం అకడి అంబేదర్ మ్యూజియాన్ని సందర్శించారు. ఫెడరేషన్ ఆఫ్ అంబేదర్ అండ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ యూకే సంయుక్త కార్యదర్శి శ్యామ్‌కుమార్ ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేదర్ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని అన్నారు. తనకు అంబేదర్ ఆదర్శమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడమే కాకుండా కొత్తగా నిర్మించిన సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టిందని, అంబేదర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ప్రాంగణంలో అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తాను 48 గంటలపాటు నిరాహార దీక్ష చేశానని గుర్తుచేశారు.
మహిళా బిల్లు.. పోస్ట్ డేటెడ్ చెక్
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని కవిత విమర్శించారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. కార్యక్రమంలో టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్, రాష్ట్ర ఫిలిండెవలప్‌మెం ట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, భారత్ జాగృతి ప్రెసిడెంట్ సుమన్ బాలుమూరి, భారత్ ఎన్నారై యూకే అధ్యక్షుడు అ శోక్‌గౌడ్, భారత్ జాగృతి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కోరబోయిన విజయ్, రాష్ట్ర కార్యదర్శి రోహిత్‌రావు, యూరోప్ ప్రెసిడెంట్ దన్నమనేని సంపత్, కార్యదర్శి కిశోర్ మునుగాల, జనరల్ సెక్రెటరీ వంశీ తులసి, సంతోష్ ఆకు ల, నవీన్‌రెడ్డి, రత్నాకర్ కడుదుల, చాడ సృజన్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి గొట్టిముకుల, రమేశ్ ఇస్సంపల్లి తదితరులు పాల్గొన్నారు.
సమ్మిళిత దేశాభివృద్ధి కోసం..
అంతర్జాతీయ మేధావి అంబేదర్ దళితుల కోసమే కాకుండా మహిళల హకుల కోసం కూడా కృషి చేశారని కవిత పేర్కొన్నారు. పలు దేశాల్లో ఇప్పటికీ ఓటు హకు కోసం మహిళలు పోరాటం చేస్తున్నారని, కానీ భారత్‌లో అంబేదర్, నెహ్రూ వంటి వారివల్ల రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచే మహిళలకు ఓటు హకు లభించిందని తెలిపారు. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం 15 శాతమే ఉండటం విచారకరమని ఆవేదన వ్యక్తంచేశారు. అంబేదర్‌ను స్ఫూర్తిగా తీసుకొని మహిళా రిజర్వేషన్ల కోసం తాను ఉద్యమించానని తెలిపారు. సమ్మిళిత దేశ నిర్మాణం కోసం అంబేదర్ స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.