తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నేరం చేశారు కాబట్టే చట్టం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబుపై కక్ష పెంచుకోవాల్సిన పెంచుకోవాల్సిన అవసరం తమకు లేదని అంబటి స్పష్టం చేశారు. రాజకీయం వైఎస్సార్‌సీపీ చాలా బలంగా ఉన్నట్టు తెలిపారు. కాగా, మంత్రి రాంబాబు ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే ఎంత మంది సీనియర్ న్యాయవాదులను పెట్టినా బెయిల్ దొరకలేదు. చంద్రబాబు నేరం చేశారు కాబట్టే చట్టం చర్యలు తీసుకుంటుంది. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులే అబద్దాలు చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు.