తెలంగాణ వీణ, సినిమా : ‘పుష్ప’ చిత్రంలోని నటనకు గానూ ఇటీవలే నేషనల్ అవార్డును పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో అరుదైన ఘనతను సాధించారు. ‘మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్’ లో మైనపు విగ్రహం ఉన్న మొదటి తెలుగు నటుడిగా ఐకాన్ స్టార్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు. తాజాగా ‘మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్’ వారు అల్లు అర్జున్ కొలతలు తీసుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో అల్లు అర్జున్ నల్లటి సూట్ ధరించి కనిపిస్తున్నారు. అయితే ఆయన తొలి తెలుగు హీరో ఎలా అవుతారు? ఇంతకు ముందు మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారి విగ్రహాలను పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి కదా అని అంతా అనుకుంటూ ఉండవచ్చు. అయితే వారి విగ్రహాలను ‘మేడమ్ టుస్సాడ్స్’కు చెందిన సింగపూర్, బాంకాక్ వంటి చోట్ల ఏర్పాటు చేశారు. దుబాయ్‌లో మాత్రం అల్లు అర్జున్ విగ్రహమే ఫస్ట్. అలా తొలి తెలుగు నటుడుగా బన్నీ రికార్డ్ క్రియేట్ చేశారు.ఈ సంవత్సర ప్రారంభంలో దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రముఖుల మరియు కళాకారుల మధ్య ఒక సిట్టింగ్ జరిగింది. ఇందులో ఒక్కొక్కరి నుంచి 200 కి పైగా కొలతలను వారు సేకరించినట్లుగా తెలుస్తోంది. అద్భుతమైన మైనపు విగ్రహాలను రూపొందించడానికి డిటైల్డ్‌గా కొలతలు తీసుకునే ప్రక్రియ ఎప్పటి నుంచో ఉంది. ఈ కొలతలతో వారు రూపొందించే విగ్రహాల పక్కన ఒరిజనల్ వ్యక్తులు నిలబడినా.. ఎవరు నార్మల్ పర్సనో కనిపెట్టడం కష్టమయ్యేంత అద్భుతంగా ఈ మైనపు విగ్రహాలను రూపొందిస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ విగ్రహాన్ని అలా చూడబోతున్నారు.