తెలంగాణ వీణ, సినిమా : ట్రాఫిక్ కష్టాలు తప్పించుకునేందుకు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా ముంబై మెట్రోలో ప్రయాణించారు. అంతటి నటుడు మెట్రోలో ప్రయాణిస్తారని ఊహించని ప్రయాణికులు హృతిక్‌ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనేక మంది ఆయనతో సెల్ఫీలు కూడా దిగేందుకు ఉత్సాహం చూపించారు. అభిమానులతో దిగిన ఫొటోలను హృతిక్ నెట్టింట షేర్ చేశారు. షూటింగ్ కోసం బయలుదేరానని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. యాక్షన్ సన్నివేశాల ముందు ట్రాఫిక్‌లో చిక్కుకుని వెన్నునొప్పి తెచ్చుకొనే బదులు ఇలా మెట్రోను ఎంచుకున్నట్టు సరదా వ్యాఖ్యలు చేశారు. మెట్రో ప్రయాణికులు తనపై ఎంతో అభిమానం కురిపించారని చెప్పుకొచ్చారు. ఇదో అద్భుతమైన అనుభవమని పేర్కొన్నారు. ఎండవేడి, ట్రాఫిక్ సమస్య ఒకేసారి తప్పిపోయాయని కామెంట్ చేశారు.